గ్రాఫిక్స్ లో మొనగాళ్లు

Thursday,September 22,2016 - 04:22 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో గ్రాఫిక్ తో అదరగొడుతూ చాలానే సినిమాలు వస్తున్నాయి. ఈ మాయాజాలంతో ఎన్ని సినిమాలు వచ్చినా ఇందులో తిరుగులేని ఇద్దరు వ్యక్తుల గురించి మాత్రం కచ్చితంగా చెప్పుకోవాలి. టాలీవుడ్ లో గ్రాఫిక్స్ అద్భుతాలు సృష్టించిన దర్శకులెవరా? అనగానే టక్కున వినిపించే పేర్లు రెండే రెండు.

kodi-rajamouli

ఈ లిస్ట్ లో మగధీర సినిమా నుండి గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ ‘ఈగ’ తో విపరీతంగా ఆకట్టుకొని తాజాగా మరో గ్రాఫికల్ వండర్ ‘బాహుబలి’ తో నేషనల్ అవార్డు దర్శకుడిగా పేరొందిన రాజమౌళి ఒకరు కాగా మరొకరు కోడి రామ కృష్ణ. ప్రస్తుతం టాలీవుడ్ లో గ్రాఫిక్స్ తో అద్భుతాలు సృష్టిస్తోంది రాజమౌళి అయినప్పటికీ ఇండస్ట్రీలో తొలిసారి ఈ మాయాజాలంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసాడు దర్శకుడు కోడి రామకృష్ణ. ‘అమ్మోరు’ సినిమాతో తొలి సారిగా గ్రాఫిక్స్ ను సరిగ్గా వాడుకున్నది ఈయనే. ఆ తరువాత ‘దేవి పుత్రుడు’,’అంజి’,’అరుంధతి’వంటి సినిమాతో తనదైన శైలి గ్రాఫిక్స్ తో ఆకట్టుకున్న ఈ దర్శకుడు తాజాగా మరో సారి కొత్త ప్రయోగం చేశాడు. కోడి రామకృష్ణ తాజా చిత్రం ‘నాగభరణం’. ఈ చిత్రంతో చనిపోయిన కన్నడ సూపర్ స్టార్ విష్ణు వర్ధన్ గారిని గ్రాఫిక్స్ తో వెండితెరపై చూపిస్తూ సంచలనం సృష్టించనున్నాడు . ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ తో అందరిలోనూ ఆసక్తిని నెలకొల్పాడు కోడి రామకృష్ణ. మరి టాలీవుడ్ లో మొదటి సారిగా గ్రాఫిక్ మహిమ చూపిన ఈ దర్శకుడు ఇప్పటికీ తనదైన మార్క్ తో ప్రస్తుతం టాలీవుడ్ లో …. గ్రాఫిక్స్ ను హ్యాండిల్ చేసే టాప్ డైరక్టర్లలో ఒకరుగా కొనసాగుతున్నాడు.