స్వామి రా రా అంటున్న బన్నీ ..

Thursday,September 22,2016 - 05:29 by Z_CLU

ఎప్పటి నుండో తమిళ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న అల్లు అర్జున్ ఆ దిశగా సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. దాదాపు ఏడాది క్రితం నుండి లింగుస్వామి తో బన్నీ సినిమా చేయబోతున్నాడనే వార్త వినిపిస్తూనే ఉంది. కానీ తాజాగా బన్నీ హరీష్ శంకర్ తో ‘డి.జె(దువ్వాడ జగన్నాథం) అనే సినిమాను ప్రారంభించడం తో ఇక లింగుస్వామి తో బన్నీ సినిమా ఇప్పుడేఅప్పుడే ఉండదేమో అనుకున్నారంతా.

    అయితే తాజాగా లింగుస్వామి దర్శకత్వం లో సినిమా ను గ్రాండ్ గా అనౌన్స్ చేశాడు బన్నీ. ఇందుకోసం తమ్ముడు అల్లు శిరీష్ తో కలిసి చెన్నై వెళ్లిన స్టైలిష్ స్టార్ ఈ చిత్ర అనౌన్స్ మెంట్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. లింగుస్వామి దర్శకత్వం లో తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞాన వెల్ రాజా నిర్మించనున్నారు. ఫిబ్రవరి నుండి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది.