డీల్ కుదురుతుందా....?

Thursday,September 22,2016 - 11:00 by Z_CLU

టాలీవుడ్ టాప్-3 సినిమాల్లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కూడా చేరింది. దీంతో వరుసగా 3 సూపర్ హిట్స్ అందుకున్న స్టార్ గా తారక్ ఇమేజ్ మరింత పెరిగింది. యంగ్ టైగర్ తో సినిమా చేసేందుకు దర్శకులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఆర్ సై అంటే చాలు సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతుంది. కానీ తారక్ మాత్రం తొందరపడడం లేదు. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాడు. మరీ ముఖ్యంగా కచ్చితంగా హిట్టిచ్చే దర్శకుడి కోసం తారక్ వెయిట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా పవన్ తో ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. తన సినిమా కోసం పవన్ తో ఎన్టీఆర్ చర్చలు జరపడానికి కారణం త్రివిక్రమ్.

trivikram_jr-ntr

                    అ..ఆ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ, త్రివిక్రమ్ మాత్రం పవన్ కే ఫిక్స్ అయిపోయాడు. పవన్ ఎప్పుడంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్లడానికి త్రివిక్రమ్ రెడీగా ఉన్నాడు. మరోవైపు పవన్ మాత్రం డాలీ దర్శకత్వంలో సినిమాను ఇప్పుడే సెట్స్ పైకి తీసుకొచ్చాడు. సో… ఎంత లేదన్నా త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ అవ్వాలంటే కనీసం 3-4 నెలలైనా పడుతుంది. ఈ గ్యాప్ లో కనుక త్రివిక్రమ్ తనను సంప్రదిస్తే, అతడితో సినిమా చేయాలనేది ఎన్టీఆర్ ప్లాన్. ఈ విషయంపైనే పవన్-ఎన్టీఆర్ మధ్య బ్రీఫ్ డిస్కషన్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.

                      నిజానికి ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు వక్కంతం వంశీ రెడీగా ఉన్నాడు. కానీ వంశీని తారక్ ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు. మరోవైపు తమిళ దర్శకుడు లింగుస్వామి, పూరి జగన్నాధ్ కూడా ఎన్టీఆర్ కు కథలు వినిపించినట్టు వార్తలు వచ్చాయి. వాటిపై కూడా తారక్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. త్రివిక్రమ్ కనుక లైన్లోకి వస్తే కచ్చితంగా అతడి ప్రాజెక్టుకే తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తారక్-త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయితే… సినిమా సూపర్ హిట్ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.