టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్ 2018 - హీరోయిన్స్

Friday,July 06,2018 - 10:03 by Z_CLU

ఒక సినిమా సక్సెస్ అయిందంటే ఆ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన డెబ్యూ యాక్టర్స్ కూడా స్టార్స్ అయిపోతారు.  అప్పటి వరకు జస్ట్ ఆవరేజ్ అనిపించుకున్న వాళ్ళు కూడా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేస్తారు. ఇక నోటెడ్ స్టార్స్, ఆడియెన్స్ మోస్ట్ ఫేవరేట్ లిస్టులో చేరిపోతారు. అలా 2018 ఫస్టాఫ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ అనిపించుకున్న వారి వివరాలివే…

 

నయనతార : సంక్రాంతి కానుకగా రిలీజైన బాలయ్య మూవీ ‘జై సింహా’ లో హీరోయిన్ గా నటించింది నయనతార. సినిమా సినిమాకి మినిమం క్రేజ్ ఇంక్రీజ్ అవ్వాల్సిందే అని టార్గెట్ పెట్టుకునే నయన్, ఈ సినిమాలో అటు గ్లామరస్ గా ఎట్రాక్ట్ చస్తూనే, ఇమోషనల్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేసింది.

అనుష్క : సంక్రాంతి సినిమాల హవా తగ్గకముందే రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజయింది అనుష్క భాగమతి. అటు హారర్ ఎలిమెంట్స్ తో పాటు ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గురించి, ఎవరు మాట్లాడినా,  అనుష్క నుండే పర్ఫామెన్స్ గురించే ఫస్ట్ మాట్లాడేవారు.. అంతలా మెస్మరైజ్ చేసింది అనుష్క.

రష్మిక మండన్న : ఒక్క సినిమాతోనే భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హీరోయిన్ రష్మిక మండన్న. ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన ఈ ముద్దుగుమ్మ, ఫస్ట్ మూవీతోనే సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది రష్మిక.

 

సమంతా : సమంతా కరియర్ లో 2018 డెఫ్ఫినేట్ గా చాలా స్పెషల్. ఓ వైపు రంగస్థలం లో డీ గ్లామర్  రోల్ లో ‘రామలచ్చిమి’ లా ఎట్రాక్ట్ చేసిన సమంతా, ‘మహానటి’ మధురవాణి లా మెస్మరైజ్ చేసిన తీరు సింప్లీ సూపర్బ్. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవ్వడంతో సమంతా రేంజ్ మరింత పెరిగిపోయింది.

కాజల్ అగర్వాల్ : 2018 లో ఫస్టాఫ్ లో ‘అ!’ సినిమా ఆక్యుపై చేసింది స్పెషల్ ప్లేస్ అనే చెప్పాలి. ఎటువంటి స్టార్ కాస్ట్ లేకుండానే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ తో ‘అ!’ అనిపించుకుంది.

 

రాశిఖన్నా : ‘తొలిప్రేమ’ సక్సెస్ తో యూత్ కి మరింత దగ్గరైపోయింది రాశిఖన్నా. మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ తో ఎంటర్ టైన్ చేఇస్న రాశిఖన్నా ఈ సినిమా తరవాత మరింత బిజీ అయిపోయింది.

 

కీర్తిసురేష్ : ఫ్యూచర్ లో ఇంకెన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు వచ్చినా ‘మహానటి’ స్థానం మాత్రం ఎప్పటికీ పదిలమే. అలాంటి సినిమాలో అవకాశం దక్కించుకున్న కీర్తి సురేష్, తన అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ తో అన్ని జెనెరేషన్ ఆడియెన్స్ తో భేష్ అనిపించుకుంది.

కైరా అద్వానీ : ఫస్ట్ సినిమాలోనే మహేష్ బాబు సరసన చాన్స్ కొట్టేసిన కైరా, మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ తో మోస్ట్ స్టైలిష్ హీరోయిన్ అనిపించుకుంది.

 

అదితి రావ్ హైదరి : సుధీర్ బాబు  ‘సమ్మోహనం’ లో నటించిన అదితి తన ట్రెమండస్ పర్ఫామెన్స్ తో మోస్ట్ సెన్సిబుల్ యాక్ట్రస్ అనిపించుకుంది. అందునా మొదటి సినిమాతోనే డబ్బింగ్ చెప్పుకున్న అదితి, జస్ట్ ట్యాలెంటెడ్ మాత్రమే కాదు, డెడికేటెడ్ కూడా అనిపించుకుంది.