శైలజా రెడ్డి అల్లుడు ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Thursday,July 05,2018 - 10:06 by Z_CLU

నాగచైతన్య నటిస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఆగష్టు 31 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్ ప్రాసెస్ ని బిగిన్ చేయనున్న ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ని జూలై 9 న రివీల్ చేయనున్నారు.

మారుతి మార్క్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య రోల్ ఎలా ఉండబోతుందోనన్న ఇప్పటికే ఆడియెన్స్ లో క్రియేట్ అయి ఉంది. అలాంటిది ఈ నెల 9 న రివీల్ కానున్న ఈ  ఫస్ట్ లుక్ లో చైతును మారుతి ఎలా ప్రెజెంట్ చేయనున్నాడో చూడాలి…

నాగచైతన్య సరసన అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య కి అత్తగా రమ్యకృష్ణ కనిపించనుంది. సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజర్.