టాలీవుడ్: ఆగస్ట్ బాక్సాఫీస్ రివ్యూ

Monday,September 02,2019 - 09:52 by Z_CLU

మిక్స్ డ్ రిజల్ట్ తో ముగిసింది టాలీవుడ్ ఆగస్ట్ బాక్సాఫీస్. కచ్చితంగా హిట్ అవుతాయనుకున్న సినిమాలు ఫెయిల్ అయితే.. అంచనాల్లేకుండా వచ్చిన సినిమాలు ఆడాయి. ఓవరాల్ గా ఆగస్ట్ లో 3-4 సినిమాలు మాత్రం విన్నర్స్ గా నిలిచాయి.

ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో గుణ369, రాక్షసుడు, శివరంజని సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కార్తికేయ నటించిన గుణ369 సినిమా యావరేజ్ అనిపించుకోగా.. బెల్లంకొండ చేసిన రీమేక్ ప్రాజెక్ట్ రాక్షసుడు కమర్షియల్ గా హిట్ అయింది. శివరంజని సినిమా ఫ్లాప్ అయింది.

రెండో వారంలో.. మన్మథుడు2, కథనం, కొబ్బరిమట్ట, అయోగ్య, కురుక్షేత్రం సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో నాగార్జున నటించిన మన్మథుడు-2 భారీ అంచనాల మధ్య రిలీజైంది. కానీ ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను అందుకోలేకపోయింది. ఇక అనసూయ నటించిన కథనం సినిమా కూడా క్లిక్ అవ్వలేకపోయింది. సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్ట సినిమా ఓ సెక్షన్ ఆడియన్స్ ను మాత్రమే ఎట్రాక్ట్ చేయగలిగింది. అయోగ్య, కురుక్షేత్రం సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి.

మూడో వారంలో.. పంద్రాగస్ట్ కానుకగా రణరంగం, ఎవరు, పోలీస్ పటాస్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అడవి శేష్ చేసిన ఎవరు సినిమా మరోసారి అంచనాలు అందుకుంది. వసూళ్ల పరంగా అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. శర్వానంద్ రణరంగం మాత్రం అంచనాల్ని అందుకోవడంలో ఫెయిల్ అయింది. ఇక పోలీస్ పటాస్ అనే సినిమాను ప్రేక్షకులు పట్టించుకోలేదు.

నాలుగో వారంలో.. కౌశల్య కృష్ణమూర్తి, ఏదైనా జరగొచ్చు, బాయ్, హవా, నివాసి, కేడీ నంబర్-1, నీతోనే హాయ్ హాయ్ సినిమాలు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు. అంతేకాదు, శివాజీరాజా తనయుడు విజయ్ రాజా నటించిన ఏదైనా జరగొచ్చు సినిమా కూడా వీటిలో ఉంది. కానీ అది కూడా ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఆగస్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తూ సాహో వచ్చింది. ప్రభాస్ నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, భారీ వసూళ్లు వస్తున్నాయి. ఈ సినిమా కంప్లీట్ రిజల్ట్ ను అప్పుడే అంచనా వేయలేం.