ఆర్-ఆర్-ఆర్ ఫ్రెష్ అప్ డేట్

Monday,September 02,2019 - 11:03 by Z_CLU

వినాయక చవితి సందర్భంగా ఆర్-ఆర్-ఆర్ యూనిట్ ఫ్రెష్ పోస్టర్ అయితే రిలీజ్ చేయలేదు కానీ, ఫ్రెష్ అప్ డేట్ మాత్రం బయటపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి బల్గేరియాలో ఓ భారీ షెడ్యూల్ జరుగుతోంది. ఎన్టీఆర్ పై ఈ షెడ్యూల్ తెరకెక్కిస్తున్నట్టు యూనిట్ ప్రకటించింది.

రాజమౌళికి బల్గేరియా కొత్తకాదు. గతంలో బాహుబలి సినిమా కోసం కోసం బల్గేరియా వెళ్లాడు రాజమౌళి. బాహుబలితో పాటు ఆర్-ఆర్-ఆర్ కూడా గత కాలానికి చెందిన కథలే కాబట్టి.. బల్గేరియా లొకేషన్లు, అక్కడి అందమైన మంచు కొండలు వాటికి బాగా సూట్ అవుతాయి.

మరోవైపు రామ్ చరణ్ మాత్రం షూటింగ్ కు దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ తన నెక్ట్స్ షెడ్యూల్ కోసం భారీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ హీరో. ఈ విషయాన్ని కూడా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అలియాభట్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.