ఓవర్సీస్ లో ప్రభాస్ తిరుగులేని రికార్డ్

Monday,September 02,2019 - 09:14 by Z_CLU

ఓవర్సీస్ లో ప్రభాస్ మరో రికార్డు సృష్టించాడు. ఈసారి అది అలాంటిలాంటి రికార్డు కాదు. వసూళ్లలో తిరుగులేని రికార్డు. అవును..వరుసగా మూడోసారి 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరయ్యాడు రెబల్ స్టార్. ఇప్పటివరకు ఏ తెలుగు హీరోకు సాధ్యం కానీ ఫీట్ ఇది.

ఆదివారం నాటి వసూళ్లతో కలుపుకొని సాహోకు 20 లక్షల 80వేల 694 డాలర్ల వసూళ్లు వచ్చాయి. అలా 3 రోజుల్లోనే 2 మిలియన్ క్లబ్ లోకి చేరడంతో పాటు.. వరుసగా మూడు సార్లు ఈ ఘనత సాధించిన హీరోగా నిలిచాడు ప్రభాస్. ఇంతకుముందు ప్రభాస్ నటించిన బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలు ఈ ఖాతాలో ఉన్నాయి.

నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ తో దూసుకుపోతోంది. ఓవర్సీస్ తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, నార్త్-ఇండియాలో సినిమాకు భారీగా వసూళ్లు రావడంతో ఇలా 3 రోజుల్లోనే 300 కోట్ల మార్క్ అందుకుంది సాహో.