అఖిల్ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసారు

Sunday,September 02,2018 - 10:06 by Z_CLU

అఖిల్ ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ‘మిస్టర్ మజ్ను’ అనే టైటిల్ వాడుకులో ఉంది. లేటెస్ట్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించారు నిర్మాత.

ఈ న్యూస్ తో మొన్నటి వరకూ ఈ టైటిల్ పై ఫాన్స్ లో ఉన్న సందేహానికి క్లారిటీ వచ్చేసింది.. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్ కాని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు. సో త్వరలోనే ఈ టైటిల్ ను రివిల్ చేసి ఫస్ట్ లుక్ ను వదలబోతున్నారు. సో నాగ్ క్లాసిక్ టైటిల్ కు ముందు మిస్టర్ తగిలిచి ‘మిస్టర్ మజ్ను’ గా మరాడన్నమాట అఖిల్.