వెంకీ -వరుణ్ 'F2' షూటింగ్ అప్ డేట్స్

Sunday,September 02,2018 - 11:02 by Z_CLU

విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘F2’షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటివలే హైదరాబాద్ లో ఓ భారీ షెడ్యూల్ ఫినిష్ చేసిన యూనిట్ రేపు యూరప్ లో మరో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. పది రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో ఓ సాంగ్ , వెంకటేష్ -వరుణ్ తేజ్ లపై ఓ చేజ్ సీన్ షూట్ చేయనున్నారు.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా , వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమాను విడుదల చేయనున్నారు.