సైరా : అవుకు రాజు పాత్ర‌లో సుదీప్

Sunday,September 02,2018 - 09:00 by Z_CLU

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘సైరా నరసింహ రెడ్డి’..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో హై టెక్నికల్‌ వేల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

 వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో క‌న్న‌డ సూప‌ర్‌స్టార్, అభిన‌య చ‌క్ర‌వ‌ర్తి సుదీప్ ‘అవుకు రాజు’ అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 2న సుదీప్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అవుకు రాజు గా సుదీప్ లుక్‌ను రిలీజ్ చేసారు యూనిట్.