మహేష్ సినిమాకు టైటిల్ ఫిక్స్...

Saturday,December 10,2016 - 06:00 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ ప్రెజెంట్ మురుగదాస్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారట యూనిట్. ఈ సినిమా సెట్స్ కి వెళ్ళింది మొదలు ఎన్నో టైటిల్స్ వినిపించినప్పటికి ఫైనల్ గా ఈ సినిమాకు ‘సంభవామి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.

   మొన్నటి వరకూ ఈ సినిమాకు ‘ఏజెంట్ శివ’ అనే టైటిల్ ను పెట్టాలని  యూనిట్ భావిస్తున్నారనే టాక్ వినిపించగా లేటెస్ట్ గా ‘సంభవామి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి రిజిస్టర్ కూడా చేయించినట్లు సమాచారం. ఇప్పటి వరకూ మహేష్ నటించిన సినిమాల్లో టైటిల్ కన్ఫర్మ్ చేయకుండా లేట్ చేస్తున్న బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా బహుశా ఇదేనేమో. మరిప్రస్తుతం  సెట్స్ పై ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.