జీ సినిమాలు (డిసెంబర్ 11th)

Saturday,December 10,2016 - 09:30 by Z_CLU

gundamma-gari-krishnulu
నటీ నటులు : రాజేంద్ర ప్రసాద్, రజని
ఇతర నటీనటులు : శుభలేఖ సుధాకర్, పూర్ణిమ, సుత్తి వీరభద్ర రావు, సుత్తివేలు, కోట శ్రీనివాస రావు, బెనర్జీ తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి
డైరెక్టర్ : రేలంగి నరసింహా రావు
ప్రొడ్యూసర్ : మిద్దె రామారావు
రిలీజ్ డేట్ : 1987

రేలంగి నరసింహా రావు డైరెక్షన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ గుండమ్మ గారి కృష్ణులు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కరియర్ లో బెస్ట్ ఫిలిం గా నిలిచిందీ ఈ సినిమా. చక్రవర్తి అందించిన సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

——————————————————————

aadhi-vishnu
హీరోహీరోయిన్లు – దాసరి అరుణ్, స్నేహ
నటీనటులు – ఐశ్వర్య, కోటశ్రీనివాసరావు, ప్రదీప్ రావత్, సుమన్, వేణుమాధవ్, అలీ, ఎమ్మెస్ నారాయణ
సంగీతం – ఎం.ఎం. శ్రీలేఖ
దర్శకత్వం – భరత్ పారేపల్లి
విడుదల తేదీ – 2008, ఆగస్ట్ 21

అప్పటికే హీరోగా మారిన దాసరి అరుణ్ కుమార్ చేసిన మరో ప్రయత్నమే ఆదివిష్ణు. అప్పుడప్పుడే టాలీవుడ్ లో పేరుతెచ్చుకుంటున్న స్నేహ ఈ సినిమాలో అరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. కోట శ్రీనివాసరావు, సుమన్ లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో నటించడం ఒక స్పెషల్ అయితే… ఎమ్మెస్ నారాయణ, అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం, వేణుమాధవ్ పండించిన కామెడీ సినిమాకు మరో ఎట్రాక్షన్.

——————————————————————

ji-jee

నటీనటులు : అజిత్ కుమార్, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : చరణ్ రాజ్, విజయ కుమార్, మణి వన్నన్, విసు, వినోద్ అల్వా తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విద్యా సాగర్

డైరెక్టర్ : N. లింగుస్వామి

ప్రొడ్యూసర్ : S.S. చక్రవర్తి

రిలీజ్ డేట్ : 11 ఫిబ్రవరి 2005

అజిత్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ‘జి’ పర్ ఫెక్ట్ యూత్ యాక్షన్ ఎంటర్ టైనర్. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ పొలిటికల్ డ్రామాని లింగుస్వామి సూపర్బ్ గా తెరకెక్కించాడు. విద్యా సాగర్ అందించిన మ్యూజిక్, యాక్షన్ సీన్స్ సినిమాకి హైలెట్.

——————————————————————

yama-kedi

నటీ నటులు  : శింబు, జ్యోతిక

——————————————————————

oh-my-friend

హీరోహీరోయిన్లు – సిద్దార్థ్, శృతిహాసన్
నటీనటులు – నవదీప్, హన్సిక,
సంగీతం – రాహుల్ రాజ్
నిర్మాత – దిల్ రాజు
దర్శకత్వం – వేణుశ్రీరాం
విడుదల – 2011, నవంబర్ 11

స్నేహానికి సరికొత్త అర్థాన్నిస్తూ తెరకెక్కిన ఓ మై ఫ్రెండ్ సినిమాకు చాలా విశేషాలున్నాయి. తెలుగులో శృతిహాసన్ కు ఇది రెండో సినిమా. అయితే శృతిహాసన్ కంటే ముందే ఆ క్యారెక్టర్ కోసం సమంతను అనుకున్నారు. అప్పటికే ఏమాయచేశావెతో సక్సెస్ అందుకున్న సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని దిల్ రాజు కూడా అనుకున్నాడు. ఆ తర్వాత అమలాపాల్, నిత్యామీనన్ లాంటి హీరోయిన్లపై కూడా ఫొటోషూట్ చేశారు. ఫైనల్ గా హీరో సిద్ధార్థ్ పట్టుబట్టి మరీ శృతిహాసన్ ను తీసుకున్నాడు. ఈ సినిమాతోనే వేణుశ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కాగా.. ఇదే మూవీతో మలయాళం ఇండస్ట్రీకి చెందిన రాహుల్ రాజ్ సంగీత దర్శకుడిగా కూడా పరిచయం అయ్యాడు. ఆన్ లైన్ లో పైరసీ జరగకుండా నిరోధించే అత్యాధునిక టెక్నాలజీ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది.

——————————————————————

chennai-express

హీరోహీరోయిన్లు – షారూక్ ఖాన్, దీపికా పదుకోన్

నటీనటులు – సత్యరాజ్, ప్రియమణి, ముకేష్ తివారి, నిక్తిన్ ధీర్

సంగీతం – విశాల్ శేఖర్

స్క్రీన్ ప్లే – దర్శకత్వం –  రోహిత్ షెట్టి

విడుదల తేదీ – 2013, ఆగస్ట్ 8

కంప్లీట్ సౌత్ ఫ్లేవర్ తో తెరకెక్కిన చిత్రం చెన్నై ఎక్స్ ప్రెస్. అందుకే ఈ సినిమా అటు నార్త్ తో పాటు సౌత్ లో కూడా దుమ్ముదులిపింది. తమిళనాడు, ఏపీ, కర్నాటక అనే తేడాలేకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా రికార్డు వసూళ్లు సాధించింది. ఓంశాంతిఓం సినిమాతో దీపికాను హీరోయిన్ గా వెండితెరకు పరిచయం చేసిన షారూక్ ఖాన్… ఆ వెంటనే చెన్నై ఎక్స్ ప్రెస్ లో కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. యాక్షన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. 2013లో దాదాపు అన్ని రికార్డుల్ని తిరగరాయడమే కాకుండా… ఇండియాలో అత్యంత వేగంగా వంద కోట్లు ఆర్జించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతోంది చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీ.