ఆ హీరోయిన్ ప్లేస్ లో సమంత !

Saturday,December 10,2016 - 04:00 by Z_CLU

టాలీవుడ్ బ్యూటీ సమంత త్వరలో అక్కినేని ఫామిలీ లో కోడలుగా అడుగుబెట్టబోతున్న విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది నాగ చైతన్య ను పెళ్లాడబోతున్న ఈ ముద్దుగుమ్మ మ్యారేజ్ కి ఇంకా టైం ఉండడం తో సినిమాలు చేసేందుకు రెడీ అయిపోయింది.

త్వరలోనే సమంత ‘సావిత్రి’ బయోపిక్ గా తెరకెక్కబోయే సినిమాలో సావిత్రి రోల్ లో కనిపించబోతుందట… మొన్నటి వరకూ ఈ సినిమాలో సావిత్రి క్యారెక్టర్ లో నిత్యా మీనన్ నటించనుందనే వార్త వినిపించగా లేటెస్ట్ గా ఆ ప్లేస్ ను సమంత రీప్లేస్ చేసిందని టాక్ . ‘ఎవడె సుబ్రహ్మణ్యం’ ఫేమ్ నాగ అశ్విన్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో సావిత్రి క్యారెక్టర్ కు సమంత కన్ఫర్మ్ అనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఇటీవలే ఓ బిగ్ ప్రాజెక్ట్ లో నటించనున్నట్లు, త్వరలోనే ఈ సినిమా డీటెయిల్స్ చెప్పనున్నట్లు సోషల్ మీడియా ద్వారా సమంత తెలియజేయడం తో ఈ సినిమా నే త్వరలో ఈ అమ్మడు అనౌన్స్ చేయడానికి రెడీ గా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.