వీళ్లు చిందేస్తే కెవ్వు కేకే

Tuesday,September 13,2016 - 10:00 by Z_CLU

 

ఒకప్పుడు ఐటెంసాంగ్ కోసం ప్రత్యేకంగా ముద్దుగుమ్మలు ఉండేవారు. మొన్నటికిమొన్న ముమైత్ ఖాన్ వరకు ఇదే ఫార్ములా నడిచింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ ట్రెండ్ టాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. హీరోయిన్లే ఐటెంభామలుగా మారిపోతున్న పరిస్థితి. కెరీర్ లో ఐటెంసాంగ్ చేయనని ఒట్టు పెట్టుకున్న కాజల్ కూడా జనతా గ్యారేజ్ తో స్పెషల్ బ్యూటీగా మారిపోయిందంటే సిచ్యుయేషన్ అర్థం చేసుకోవచ్చు.

thammana-item

 

కాజల్ కంటే ముందే ఐటెంక్వీన్ గా మారిపోయింది మిల్కీబ్యూటీ తమన్న. అల్లుడు శీను, స్పీడున్నోడు లాంటి సినిమాల్లో తమన్న ఐటెంసాంగ్స్ కుర్రాళ్లను కిక్కెక్కించాయి. ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే, ఇలా స్పెషల్ సాంగ్స్ తో కూడా సందడి చేస్తోంది మిల్కీబ్యూటీ.

shruthi-chennaiclips-1024x640

 

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఐటెంభామగా అలరించింది. ఆగడు సినిమాలో శృతిహాసన్ చేసిన ఐటెంసాంగ్ ఇప్పటికీ కుర్రాళ్లకు గుర్తే. శ్రీమంతుడుతో సూపర్ హిట్ కొట్టినప్పటికీ… ఆగడు పేరు చెప్పిన వెంటనే శృతిహాసన్ ఐటెంసాంగ్ గుర్తొస్తుందంటే… టాలీవుడ్ జంక్షన్ ఏ రేంజ్ లో జామ్ అయిందో ఊహించుకోవచ్చు.

anjali-item-song-still

 

తమన్న, శృతిహాసన్ తో పాటు హీరోయిన్ అంజలి కూడా ఐటెంసాంగ్ తో అదరగొట్టింది. సూర్య హీరోగా వచ్చిన సింగం-2తో ఐటెంభామగా మారిన ఈ తెలుగమ్మాయి…. తాజాగా సరైనోడు సినిమాలో బన్నీతో కలిసి డాన్స్ ఫ్లోర్ దద్దరిల్లేలా స్టెప్పులేసింది. ఇలా తెలుగులో చాలామంది భామలు స్పెషల్ సాంగ్స్ తో హోరెత్తిస్తున్నారు.