బన్నీ సరసన నాగ చైతన్య లవర్ ?

Tuesday,September 13,2016 - 01:00 by Z_CLU

 

బన్నీ హరీష్ శంకర్ తో సినిమాకు రెడీ అయ్యాడు. ‘డి.జె(దువ్వాడ జగన్నాథం’ అనే సరి కొత్త టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. ఇటీవలే ‘సరైనోడు’ తో సూపర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ స్వల్ప విరామం తరువాత నటించనున్న ఈ సినిమా లో నాగ చైతన్య లవర్ ను ఎంపిక చేశారట యూనిట్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన చైతు లవర్ అయితేనే బాగుంటుందని భావిస్తున్నాడట దర్శకుడు హరీష్ శంకర్. అంతే కాదు బన్నీ కూడా ఈ నాయక పైనే ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం.

నాగ చైతన్య లవర్ అంటే ఎవరో కాదు ‘ఒక లైలా కోసం’ సినిమాలో చైతు సరసన లవర్ గా నటించిన పూజ హెగ్డే వెంటనే మెగా హీరో వరుణ్ ముకుంద లో నాయకిగా అలరించి  తాజాగా హృతిక్ రోషన్ తో ‘మొహెంజోదారో’ వంటి భారీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మళ్ళీ టాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దు గుమ్మ ‘డీజే’ తో జత కట్టే ఛాన్స్ కొట్టేసిందట. ఇప్పటికే అమ్మడు ను చిత్ర యూనిట్ ఫైనల్ చేసేశారనే టాక్ వినిపిస్తుంది.