ఫస్ట్ టైం పవర్ ఫుల్ గెస్ట్ రోల్... ?

Tuesday,September 13,2016 - 09:00 by Z_CLU

 

జనతా గ్యారేజ్ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు తారక్. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ సినిమా తర్వాత చేయబోయే చిత్రంపై ఇప్పటివరకు ఎన్టీఆర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాతే నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఇంతలోనే మరో పెద్ద గాసిప్, ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. కల్యాణ్ రామ్ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేయొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇజమ్ అనే సినిమా చేస్తున్నాడు కల్యాణ్ రామ్. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో తారక్ కోసం ఓ పవర్ ఫుల్ గెస్ట్ రోల్ ను డిజైన్ చేశారట. దీనికి సంబంధించి ఎన్టీఆర్ తో కల్యాణ్ రామ్, పూరి జగన్నాధ్ డిస్కషన్ కూడా చేశారట. అయితే ఆ పవర్ ఫుల్ గెస్ట్ రోల్ లో తారక్ నటిస్తాడా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

కల్యాణ్ రామ్ తో కలిసి నటించాలని ఉందని ఎన్టీఆర్ కొన్నిసార్లు చెప్పాడు. సేమ్ టైం… తన ఫేవరెట్ దర్శకుడు పూరి జగన్నాధ్ అని కూడా చెప్పాడు. అలా చెప్పాడు కాబట్టి… కల్యాణ్ రామ్-పూరి కలిసి చేస్తున్న సినిమాలో తారక్ కూడా ఉంటాడనే పుకారు షికారు చేస్తోంది.