థమన్ మ్యూజికల్ జర్నీ

Wednesday,November 21,2018 - 06:40 by Z_CLU

ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నేటితో పరిశ్రమలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. తక్కువ టైంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ స్థానంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న థమన్ పై  జీ సినిమాలు స్పెషల్ స్టోరీ..

సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1993  నవంబర్ 21 న సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ గారి దగ్గర డ్రమ్మర్ గా జాయిన్ అయ్యాడు తమన్. అప్పటి నుండి సంగీత ప్రపంచంలో  కొనసాగుతున్న తమన్ వయసు ఇప్పుడు 35 ఏళ్ళు.

బాలకృష్ణ హీరోగా నటించిన ‘భైరవద్వీపం’ సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టాడు తమన్. ఈ సినిమాకు సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ దగ్గర డ్రమ్మర్ గా పనిచేసాడు.

కెరీర్ స్టార్టింగ్ లో కొందరు సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన తమన్ తొమ్మిది వందల సినిమాలకు మ్యూజిక్ ప్రోగ్రామర్ గా పనిచేసాడు.

మ్యూజిక్ లో దిట్టైన తమన్ ఇప్పటి వరకూ 111 ట్రూపులతో ఏడువేల స్టేజీ షోస్ చేసాడు.

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆల్మోస్ట్ అందరు దర్శకులతో అలాగే హీరోలతో పనిచేసిన తమన్  సంగీత దర్శకుడిగా  ‘అరవింద సమేత’ సినిమాతో 100 సినిమాల మార్క్ కి చేరుకున్నాడు.