రైటర్ రెమ్యునరేషన్ 2 కోట్లు 

Wednesday,November 21,2018 - 03:44 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో రైటర్స్ కి డిమాండ్ పెరుగుతోంది.. ఆల్మోస్ట్  రైటర్లందరూ బిజీ బిజీ గా సినిమాలు చేస్తున్నారు. అయితే ఓ యంగ్ రైటర్ మాత్రం డైరెక్టర్ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకెల్తున్నాడు. అతనే ప్రసన్న కుమార్ బెజవాడ. మొదట టివీ రంగంలో పనిచేసిన ప్రసన్న ‘సినిమా చూపిస్తా మావ’ సినిమాతో ఇండస్ట్రీ కి రైటర్ గా పరిచయం అయ్యాడు. ఆ సినిమాకు దర్శకుడు త్రినాద్ రావు నక్కిన తో కలిసి పనిచేసిన ప్రసన్న మొదటి సినిమాతోనే రైటర్ గా మంచి మార్కులు అందుకున్నాడు. ఆ తర్వాత కూడా త్రినాద్ రావు దర్శకత్వం వహించిన ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాలకు కథ , స్క్రీన్ ప్లే , మాటలు అందించాడు.

ప్రస్తుతం ఈ రైటర్  కోటి రూపాయిలు తీసుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇది నిజం కాదు. ఈ రైటర్ ఏకంగా 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. త్వరలోనే వెంకటేష్, రవితేజ సినిమాలకు కథ , మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ యంగ్ రైటర్  ఒక్కో సినిమాకు దాదాపు 2 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.