సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్ రివ్యూ

Wednesday,November 21,2018 - 07:48 by Z_CLU

సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్ రిలీజయింది. 1:41 సెకన్ల ఈ ట్రైలర్ సినిమా స్టోరీని రివీల్ చేస్తుంది. సుబ్రహ్మణ్యపురం లో జరిగే ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ చుట్టూ జరిగే కథాంశంతో తెరకెక్కుతుంది ఈ సినిమా.

సుబ్రహ్మణ్య పురం లోని గుడిలో జరిగే అద్భుతాలు, గాంధార లిపి, దేవుడిని నమ్మని హీరో వీటన్నింటి మధ్య ఒక ఇమోషనల్ కనెక్టివిటీ లాంటి అంశాలతో ఉన్న ఈ ట్రైలర్, సినిమాపై ఓవరాల్ గా క్యూరియాసిటీని జెనెరేట్ చేస్తుంది. అల్టిమేట్ గా భగవంతుడికి, ఒక కామన్ మ్యాన్ కి మధ్య జరిగే సంఘర్షణ ఈ ‘సుబ్రహ్మణ్య పురం’ అని తెలుస్తుంది.

ఈ సినిమాలో ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తుంది. శేఖర్ చంద్ర ఈ సినిమాకిమ్యూజిక్ కంపోజర్. బీరం సుధాకర్ రెడ్డి ఈ సినిమాని సుధాకర్ ఇంపెక్స్ IPL బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.