రజినీకాంత్ 2.0 రన్ టైమ్ రివీలయింది

Thursday,November 22,2018 - 12:28 by Z_CLU

రజినీకాంత్ 2.0 రన్ టైమ్ రివీలయింది. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నిడివి 2 గంటల 28 నిమిషాలు. ఈ లెక్కన చూస్తే శంకర్ కరియర్ లోనే అతి తక్కువ నిడివి ఉన్న సినిమా 2.0.

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘ఐ’ సినిమా 188 నిమిషాలైతే, రోబో సినిమా నిడివి 167 నిమిషాలు. కానీ ఈ సినిమా వరకు వచ్చేసరికి 148 నిమిషాలకు కుదించాడు దర్శకుడు శంకర్. హెవీ యాక్షన్ సీక్వెన్సెస్ మధ్య ఇమోషనల్ స్టోరీలైన్ తో ఎంటర్టైన్ చేయనున్న 2.0, ఏ మాత్రం ల్యాగ్ లేకుండా స్ట్రేట్ ఫార్మాట్ లో ఎంటర్టైన్ చేయనుంది.

షార్ట్ అండ్ క్రిస్పీ ఫార్మాట్ లో రెడీ టు రిలీజ్ మోడ్ లో ఉన్న 2.0 నవంబర్ 29 నుండి  వరల్డ్ వైడ్ గా ఎంటర్టైన్ చేయనుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కింది ఈ బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్. A.R. రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఎమీ జాక్సన్ హీరోయిన్. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ బర్డ్ మ్యాన్ గా వెరీ పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.