టాక్సీవాలా టాప్-5 ఎట్రాక్షన్స్

Thursday,November 15,2018 - 03:23 by Z_CLU

టాక్సీవాలాలో విజయ్ దేవరకొండ ఓ టాక్సీ డ్రైవర్. ఫుల్ స్పీడ్ తో కారు డ్రైవ్ చేస్తుంటాడు. ఎప్పుడూ టాప్ గేర్ ఇష్టపడతాడు. సేమ్ టు సేమ్ టాక్సీవాలా సినిమా కూడా ఇలానే టాప్ గేర్ లో ఉంటుంది. రిలీజ్ కి ముందే ‘టాక్సీవాలా’ని వైడ్ రేంజ్ లో రీచ్ అయ్యేలా చేస్తున్న పవర్ గేర్స్ ఇవే…

పవర్ గేర్ 1 : ఈ ‘టాక్సీవాలా’ రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో వైబ్స్ క్రియేట్ చేస్తుందంటే దానికి ఫస్ట్ ఎవర్ పవర్ గేర్ విజయ్ దేవరకొండ. ఈ ప్రాజెక్టు పికప్ అందుకోవడానికి కారణం హీరో. కేవలం విజయ్ దేవరకొండ వల్లే టాక్సీవాలా సినిమాకు ఊపు వచ్చింది. అందుకే విజయ్ దేవరకొండ, పవర్ గేర్-1.

పవర్ గేర్ 2: విజయ్ దేవరకొండ తర్వాత టాక్సీవాలాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన పవర్ గేర్ ఎలిమెంట్ స్టోరీలైన్. హీరో సబ్ కాన్షియస్ మైండ్ కి, టాక్సీ కి మధ్య ఉండే ఇమోషనల్ రిలేషన్ షిప్ ఈ సినిమాలో హై పాయింట్.

పవర్ గేర్ 3 : ఇక హీరో, స్టోరీలైన్ తరవాత ఈ ‘టాక్సీవాలా’ ని నెక్స్ట్ గేర్ కి తీసుకెళ్లింది నిర్మాతలు. GA2, UV పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాడు నిర్మాత SKN. ఈ సినిమా అవుట్ స్టాండింగ్ అవుట్ పుట్ కి బ్యాక్ బోన్ గా నిలిచింది ప్రొడక్షన్.

పవర్ గేర్ 4: జేక్స్ బిజాయ్ మ్యూజిక్ ఈ సినిమాకి బేసిక్ గేర్ ఎలిమెంట్ అనే చెప్పాలి. జ్యూక్ బాక్స్ కన్నా ముందు రిలీజైన ‘మాటే వినదుగ’ సాంగ్, సిద్ శ్రీరామ్ వాయిస్ చేసిన మేజిక్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

 

పవర్ గేర్ 5 : విజయ్ దేవరకొండ టాక్సీని హైవే పై నిలబెట్టిన మోస్ట్ పవర్ ఫుల్ గేర్ ‘పోస్ట్ ప్రొడక్షన్. ఈ సినిమా షూటింగ్ కన్నా, గ్రాఫిక్స్ కే ఎక్కువ టైమ్ తీసుకున్నారు మేకర్స్. సినిమాలో కలరింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. క్రిస్పీ స్క్రీన్ ప్లే తో ఎడిట్ అయిన ‘టాక్సీవాలా’ హాలీవుడ్ స్టైల్ లో ఉండబోతుంది.