తరుణ్ భాస్కర్ కి హీరోయిన్ దొరికింది...

Friday,May 10,2019 - 05:46 by Z_CLU

ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి తరుణ్ భాస్కర్ కొత్త సినిమా పనులు. తరుణ్ భాస్కర్ సినిమా అంటే డైరెక్టర్ గా కాదు.. హీరోగా. విజయ్ దేవరకొండ ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా ఈ సినిమా హీరోయిన్ ని ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్.

రీసెంట్ గా ‘N4’ అనే తమిళ సినిమాలో నటించిన ‘వాణి భోజన్’ ఈ సినిమాతో తెలుగులో ఇంట్రడ్యూస్ కానుంది. ఇప్పటి వరకు 2 సినిమాలకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది ఈ సినిమా టీమ్.

షమ్మీర్ డైరెక్షన్ లో తెరకెక్కనుందీ సినిమా. ఇంకా ఈ సినిమాకి సంబంధించి మిగతా టెక్నీషియన్స్ డీటేల్స్ తెలియాల్సి ఉంది. ఈ సినిమాని విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.