విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్ గా సక్సెసవుతాడా..?

Friday,August 30,2019 - 10:01 by Z_CLU

విజయ్ దేవరకొండ కరియర్ కి ఓ ప్రత్యేకత ఉంటుంది… ‘పెళ్లిచూపులు’ సినిమాలో కుర్రాడు కనీసం మనసులో మాట కూడా బయటికి చెప్పుకోలేడు అనిపించుకుని… ఇమ్మీడియట్ గా అర్జున్ రెడ్డి చేసేస్తాడు. ఫ్యాన్స్ ఆ ఇమేజ్ ని మైండ్ లో ఇలా ఫిక్స్ చేసుకున్నారో లేదో ‘గీత గోవిందం లో ‘నేను చాలా మారిపోయాను మేడమ్’ అంటూ అమాయకంగా చెప్పి కన్విన్స్ చేసేస్తాడు… అంతలోనే డిఫెరెంట్ జోనర్ ఎంచుకుని ‘టాక్సీవాలా’ చేస్తాడు… అల్టిమేట్ గా ఓ పర్టికులర్ స్ట్రాటజీని ఫాలో అవుతూ సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు విజయ్ దేవరకొండ. మరి ప్రొడ్యూసర్ గా..?  

తరుణ్ భాస్కర్ హీరోగా చేస్తానని బ్యానర్ పేరు కూడా లాంగ్ బ్యాక్ అనౌన్స్ చేశాడు… అందులో కొత్తేం లేదు. కాకపోతే ఈ సినిమా టైటిల్ ని రీసెంట్ గా అనౌన్స్ చేశాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తాడు. ఈ  సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది ఇంకా డీటేల్స్ బయటికి రాలేదు కానీ… ఈ రౌడీ బాయ్ మాత్రం ప్రొడ్యూసర్ గా గట్టి సక్సెస్ అందుకోవాలనే కసితో ఉన్నట్టే అనిపిస్తుంది.

 

బాధ్యతలు నెత్తిమీద వేసుకోవడం విజయ్ దేవరకొండకి కొత్తేం కాదు… హీరోగా చేస్తున్న ప్రతి సినిమాని స్ట్రాటజికల్  గా ప్రమోట్ చేస్తాడు. కథ దగ్గరి నుండి ప్రొడక్షన్ వ్యాల్యూస్ వరకు ఇన్వాల్వ్ అవుతాడు. ట్రోల్స్ ని కూడా చాలా తెలివిగా మ్యానేజ్ చేస్తాడు… ఏది ఏమైనా అవతలి వాళ్ళు విజయ్ దేవరకొండ ఏం చేసినా ఇష్టపడేలా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేస్తాడు. అయితే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకోవడానికి ఈ క్వాలిటీస్ సరిపోతాయా…?

చూడాలి మరీ.. తలుచుకుంటే సొంత సినిమానే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు.. లేకపోతే రీసెంట్ గా ఇంట్రడ్యూస్ అయిన తమ్ముడితో కూడా చిన్న సినిమా చేసుకోవచ్చు.. కానీ ఏరికోరి తన కరియర్ కి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తున్నాడు.. చూడాలి మరీ.. విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్ గా ఏ స్థాయిలో నిలబడతాడో… ఇంకెన్నెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడో…