అల్లు శిరీష్ ‘ABCD’ లైన్ క్లియరయింది

Friday,May 10,2019 - 06:36 by Z_CLU

మే 17 న రిలీజవుతుంది అల్లు శిరీష్ ‘ABCD’. ఇప్పటికే ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కూడా క్లియర్ చేసుకుంది. క్లీన్ ‘U’ సర్టిఫికెట్ పొందింది ABCD. 

మళయాళ బ్లాక్ బస్టర్ ‘ABCD’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా అదే స్థాయిలో ఎట్రాక్ట్ చేయడం విశేషం. అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ గా అల్లు శిరీష్, ఇప్పటికే రిలీజైన విజువల్స్ లో ఇంప్రెస్ చేస్తున్నాడు. నాగబాబు ఈ సినిమాలో అల్లు శిరీష్ కి ఫాదర్ గా నటించాడు. 

సంజీవ్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిందీ సినిమా. మధుర శ్రీధర్, యష్ రంగినేని సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. జుధా సాంధీ మ్యూజిక్ కంపోజర్.