అది అల్లరి నరేష్ కే సాధ్యం...

Friday,May 10,2019 - 04:45 by Z_CLU

టెక్నాలజీ ఏ స్థాయిలో పెరిగినా, ఫ్యాన్స్ అంచనాలను రీచ్ అవ్వాలంటే ప్రతి స్టార్ హీరోకి కథ దగ్గరి నుండి బిగిన్ అయితే ప్రతీది పర్ఫెక్ట్ గా రావాలనే ప్రాసెస్ లో ప్రతి సినిమాకి ఎక్కువ టైమ్ పడుతుంది. దాంతో 25 సినిమాలకే మైల్ స్టోన్ సినిమా అనే సీజన్ బిగిన్ అయింది. కానీ అల్లరి నరేష్ విషయంలో కంప్లీట్ గా వేరు. జస్ట్ 17 ఏళ్ళు… చేసిన సినిమాలు ఏకంగా 55.. ఇది కేవలం ఈ అల్లరోడికే సాధ్యం.

2002 లో సరిగ్గా ఇదే రోజు తెలుగు సినిమాకి పరిచయమైన అల్లరి నరేష్ కామెడీ జోనర్ లో ఇన్నేసి సినిమాలు చేస్తాడని ఎవరూ గెస్ కూడా చేసి ఉండరు. ‘చేతిలో ఉన్న బడ్జెట్ తో మినిమం గ్యారంటీ సినిమా కావాలంటే చేయాల్సింది అల్లరి నరేష్ తోనే…’ అనేంతగా ఫిల్మ్ మేకర్స్ కి దగ్గరయ్యాడు… కడుపు నిండా కామెడీ కావాలంటే అల్లరి నరేష్ సినిమా చూడాల్సిందే అనేంతగా ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యాడు.

అలాగని ఒక్కకామెడీ సినిమాలతోనే సరిపెట్టుకున్నాడా అంటే అస్సలు కాదు… అవకాశం దొరికినప్పుడల్లా తనలోని మరో యాంగిల్ ని ఎప్పటికప్పుడు ప్రెజెంట్ చేస్తూనే ఉన్నాడు. ‘గమ్యం’ లో గాలిశీనులా  అమాయకత్వంతో మనసు దోచుకోవాలన్నా, ‘నేను’ సినిమాలో సైకోపతిక్ యంగ్ స్టర్ లా కనిపించాలన్నా, లడ్డూ బాబులా.. లావుపాటి అబ్బాయిలా నవ్వించాలన్నా చివరికి సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ లాంటి సినిమాలో కీ రోల్ ప్లే చేసి సినిమాకి మరింత వ్యాల్యూ ఆడ్ చేయలన్నా అల్లరి నరేష్ ఉండాల్సిందే…

ఈ లెక్కన అల్లరి నరేష్ ఇదే స్పీడ్.. ఇవే స్టాండర్డ్స్ మెయిన్ టైన్ చేయాలి కానీ 100 సినిమాలు కంప్లీట్ చేసుకోవడం పెద్ద విషయమేం కాదు. ఇలాంటి వండర్స్ చేయాలంటే ఒక్క అల్లరి నరేష్ కే సాధ్యం.