మిల్కీబ్యూటీ దసరా కానుక

Wednesday,October 05,2016 - 03:29 by Z_CLU

మిల్కీబ్యూటీ తమన్న లీడ్ రోల్ లో నటించిన సినిమా అభినేత్రి. ప్రభుదేవా, సోనూసూద్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా దసరా కానుకగా విడుదలకు సిద్ధమైంది. ఇలా ఓ త్రిభాషా చిత్రాన్ని చేయడం తమన్నకు కెరీర్ లో ఇదే ఫస్ట్ టైం. 3 భాషల్లో ఒకేసారి నటించడం చాలా కష్టమని, ఇకపై ఇలాంటి ప్రయోగాలు చేయనని తమన్న తాజా ఇంటర్వ్యూలో చెప్పేసింది. ఇప్పుడు ప్రమోషన్ లో కూడా అదే బాధ అనుభవిస్తోంది. తెలుగు-తమిళ-హిందీ భాషల్లో విడుదలకానున్న అభినేత్రికి ప్రచారం కల్పించేందుకు దేశమంతా తిరుగుతోంది మిల్కీబ్యూటీ. ఇప్పటికే విడుదలైన ట్రయిలర్స్, స్టిల్స్, మేకింగ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో.. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉంది తమన్న. దసరా కానుకగా ఈ శుక్రవారం అభినేత్రి సినిమా థియేటర్లలోకి రానుంది.