మరో సినిమా ఓకే చేసిన బాలయ్య

Wednesday,October 05,2016 - 04:30 by Z_CLU

రామరాజ్యం తీసుకొస్తానని చెప్పడం రొటీన్. రైతు రాజ్యం స్థాపిస్తానని చెప్పడం సమ్ థింగ్ స్పెషల్. ప్రస్తుతం బాలయ్య అదే పనిలో ఉన్నాడు. రైతుల కోసమే ప్రత్యేకంగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. రైతు సమస్యలు, వాళ్ల కష్టాల నేపథ్యంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు. బాలయ్య 101వ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తాడు. సినిమాకు రైతు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ లో ఉన్న నటసింహం… ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఏమాత్రం రైతు ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకొస్తాడు. డిసెంబర్ లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. నిజానికి ఇదే కథను తన సెంచరీ సినిమాగా తెరకెక్కించాలని భావించిన బాలయ్య… ఆఖరి నిమిషంలో శాతకర్ణి సినిమాకు ఓటేశాడు.