పుకార్లను ఖండించిన శాతకర్ణి టీం

Friday,December 23,2016 - 09:30 by Z_CLU

గౌతమీపుత్ర శాతకర్ణి ట్రయిలర్ అదిరిపోయింది. చూస్తుండగానే యూట్యూబ్ లో దానికి 40లక్షల వ్యూస్ వచ్చాయి. అయితే అంతలోనే ఈ మూవీపై ఊహించని పుకారు ఒకరు బయలుదేరింది. తక్కువ టైమ్ లో అద్భుతమైన ఔట్ పుట్ తో సినిమాను బాగా తీశాడంటూ దర్శకుడు క్రిష్ ను క్రిటిక్స్ మెచ్చుకున్న కొన్ని రోజులకే… అసలు శాతకర్ణి సినిమాలో అన్ని సీన్లు క్రిష్ తీయలేదనే పుకారు బయల్దేరింది. సమయం లేకపోవడంతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కోసం బాలీవుడ్ మూవీ బాజీరావ్ మస్తానీకి చెందిన స్టాక్ షాట్స్ లోంచి కొన్ని సన్నివేశాల్ని వాడుకున్నారంటూ రూమర్ పుట్టింది. దీనిపై గౌతమీపుత్ర శాతకర్ణి టీం పక్కా క్లారిటీ ఇచ్చింది.

బాలయ్య ప్రతిష్టాత్మక వందో సినిమాలో ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ క్రిష్ తెరకెక్కించింది మాత్రమేనని యూనిట క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, మరో సినిమాను నుంచి కాపీ కొట్టాల్సిన అవసరం క్రిష్ కు లేదని, తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఉంటుందని స్పష్టంచేసింది. దీంతో 2 రోజులుగా నడుస్తున్న పుకార్లకు చెక్ పడింది. ఈ సినిమా ఆడియో వేడుకను సోమవారం నాడు తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు లాంటి రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్స్ ఈ ఈవెంట్ కు హాజరవుతారు.