లవర్ బాయ్ కబుర్లు

Wednesday,October 05,2016 - 03:17 by Z_CLU

ఫస్ట్ టైం సమంత గురించి..

ప్రస్తుతం నేను సమంత ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.. మా పెళ్లి వచ్చే ఏడాది జరగనుంది. ఎంగేజ్ మెంట్ కూడా ఆ ఏడాదే ఉంటుంది. ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. కాబట్టి ఎంగేజ్ మెంట్, పెళ్లి రెండు వచ్చే ఏడాది లోనే.

అది కరెక్ట్ కాదు…

సమంత పెళ్లి తరువాత సినిమాలు చెయ్యదని విన్నాను. అది కరెక్ట్ కాదు. ఒక టాప్ హీరోయిన్ గా ఎదగడానికి తను చాలా కష్టపడింది. అంత కష్ట పడి ఈ స్థాయికొచ్చాక సినిమాలు మానేయమని చెప్పడం కరెక్ట్ కాదు. తనకి సినిమా అంటే చాలా ప్యాషన్. సో పెళ్లి తర్వాత కూడా నటిస్తానంటే నేను అడ్డుచెప్పను.

వాటిని పట్టించుకోను..

ఇటీవలే సోషల్ మీడియాలో మా లవ్ గురించి ఓ రేంజ్ లో టాక్ నడిచింది.. నేను సమంత కలిసి వాటి గురించి మాట్లాడుకుంది చాలా తక్కువ. నేను వాటిని పెద్దగా పట్టించుకోను.

siv_96940177

అవసరం బట్టే…

నేను దేని గురించీ ఎక్కువగా మాట్లాడను. అవసరం అనుకుంటే కచ్చితంగా మాట్లాడతాను. అందుకే మా ప్రేమ గురించి  ఎప్పుడూ స్పందించలేదు. ఇక ప్రేమమ్ ప్రమోషన్ లో మాట్లాడక తప్పలేదు. కానీ నాకు నా పర్సనల్ విషయాలు చెప్పడం, మాట్లాడటం అస్సలు ఇష్టం ఉండదు..

ముందు నాన్నకే..

మా ప్రేమ విషయాన్ని ముందు నాన్నకే చెప్పాను. ఆ తరువాత మా ఫ్యామిలీలో అందరికీ చెప్పాను. మా కుటుంబంలో అందరికీ మా పెళ్లి ఇష్టమే.

టాటూ మీనింగ్ అంతే..

నా చేతి మీద సామ్ చేతి మీద ఉండే టాటూ ఓ రోమన్ సింబల్. క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేది దాని అర్ధం అంతే…

నాన్న, నేను ఇద్దరం షాక్…

నా లవ్ గురించే నాన్నకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే… అఖిల్ తన లవ్ గురించి చెప్పేశాడు. ఒక్కసారిగా నేను నాన్న ఇద్దరం షాక్ అయ్యాం. తరువాత నాన్న వాడి లవ్ కి కూడా ఓకే అనేశారు. మా ఫ్యామిలీకి కూడా ఆ అమ్మాయి నచ్చడంతో వాడి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది .

నాకంటే ముందే…

నా పెళ్లి వచ్చే ఏడాది జరగనుంది. అంతకంటే ముందే అఖిల్ పెళ్లి జరుగుతుంది. కానీ ఇద్దరి పెళ్లిళ్లు వచ్చే ఏడాదే. అంటే మా ఫ్యామిలీకి వచ్చే ఏడాది రెండు పండగలన్నమాట..

siv_96990173

తప్పలేదు…

మలయాళం ప్రేమమ్ కాస్త లెంగ్త్ అండ్ స్లోగా ఉంటుంది. అక్కడ అలా ఉంటే ఓకే కానీ మన ఆడియన్స్ కి అలా ఉంటే నచ్చదు. అందుకే కాస్త నిడివి తగ్గించాం. అలా అని స్టోరీ తగ్గించలేదు. స్క్రీన్ ప్లే కాస్త మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చాం. మూడో లవ్ స్టోరీ ని కాస్త చేంజ్ చేసాం. కొన్ని మార్చక తప్పలేదు..

నాన్న ఆ రకంగా భాగం అయ్యాడు..

ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి నాన్న చాలా కేర్ తీసుకున్నారు. ఈ సినిమాలో నాన్న కనిపించరు కానీ వాయిస్ వినిపిస్తుంది. సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పారు. ఆ రకంగా ఈ సినిమాలో భాగం అయ్యారు.

ఆ టైటిల్ కాదు…

కళ్యాణ్ కృష్ణ తో నేను చెయ్యబోయే సినిమా సగం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో… సగం సిటీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ‘నిన్నే పెళ్లాడతా’ అనే టైటిల్ కాదు కానీ ఆ తరహా కథ కాబట్టి ఆ టాక్ వచ్చింది అంతే. ఆ సినిమాకు సంబంధించి ఇంకా ఏ టైటిల్ ఫిక్స్ చేయలేదు.

కథ దొరికితే ఖచ్చితంగా…

నేను-అఖిల్ కలిసి ఓ మల్టీస్టారర్ చెయ్యాలని ఫ్యాన్స్ అడుగుతున్నారు. మనం లాంటి కథ దొరకడం ఆ సినిమాలో మా అందరికీ మంచి క్యారెక్టర్స్ దొరకడం వళ్ళ కలిసి నటించాం. అలాంటి కథ దొరికితే నేను అఖిల్ కచ్చితంగా మల్టీ స్టారర్ చేస్తాం..

siv_96950176

సమంత యూ-టర్న్

సమంత యు-టర్న్ అనే సినిమా చేయబోతుంది. ఆ సినిమా వివరాలు ఇంకా తెలియదు త్వరలోనే అనౌన్స్ ఉంటుంది.

కచ్చితంగా చేస్తా….

ఇటీవలే టు-స్టేట్స్ అనే సినిమా నేను  చేయబోతున్నట్టు రాశారు. కానీ ఆ సినిమా ఎవరో తీసుకున్నారని తెలిసింది. అది మంచి సినిమా. ఇంకా నా వరకూ రాలేదు. వస్తే కచ్చితంగా చేస్తా.

అందుకే ఆలస్యం అవుతుంది..

నేను నటించిన  సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్ డీలే అవ్వడానికి తమిళ్ వెర్షన్ కారణం. తెలుగు వెర్షన్ షూట్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. సో త్వరలోనే ఆ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నా..

siv_96970175

కథే ముఖ్యం..

నన్ను చాల మంది బిగ్ డైరెక్టర్స్ తో ఎందుకు చెయ్యడం లేదని ఆడుతున్నారు. ఇప్పటి వరకూ నాకు ఏ బిగ్  డైరెక్టర్ కథ చెప్పలేదు. నాకు కథ చెప్తే కచ్చితంగా చేస్తాను. అయినా  బిగ్ డైరెక్టర్స్- స్మాల్ డైరెక్టర్ అని ఎప్పుడు ఆలోచించలేదు.  కథే ముఖ్యం. ప్రేమమ్ తరువాత చందు మొండేటి కూడా బిగ్ డైరెక్టర్ అయిపోవచ్చు కదా...

త్వరలోనే కలిసి ఓ సినిమా..

నేను సమంత కలిసి మళ్ళీ ఓ సినిమా చేస్తాం. ఇప్పటి వరకూ దాని గురించి ఆలోచించలేదు కానీ కచ్చితంగా మళ్ళీ కలిసి ఓ సినిమా చేయాలని ఇద్దరికీ ఉంది…