అల్లరి నరేష్ మళ్లీ ట్రాక్ పైకొస్తాడా?

Tuesday,August 20,2019 - 01:38 by Z_CLU

రీసెంట్ టైమ్స్ లో సరైన హిట్ కొట్టలేకపోయాడు అల్లరి నరేష్. లాస్ట్ ఇయర్ అల్లరోడు చేసిన సిల్లీ  ఫెలోస్ కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. సరిగ్గా అదే టైమ్ లో ‘మహర్షి’ సినిమాలో ఓ కీలక పాత్ర చేశాడు. హీరోగా కాకుండా, హీరో ఫ్రెండ్ లో నటించాడు. అది సూపర్ సక్సెస్ అయి నరేష్ కి కూడా నటుడిగా మరింత పేరు తెచ్చింది. ‘మహర్’షి తర్వాత ఇప్పుడు మళ్లీ హీరోగా మారాడు అల్లరినరేష్. ‘బంగారు బుల్లోడు’ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా అల్లరోడ్ని సక్సెస్ ట్రాక్ పైకి తీసుకొస్తుందా?

‘మహర్షి’ ఇచ్చిన సక్సెస్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలని చూస్తున్నాడు అల్లరి నరేష్. ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని బంగారు బుల్లోడు సినిమాను జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. మహర్షిలో సీరియస్ రోల్ లో మెప్పించిన అల్లరోడు, ‘బంగారు బుల్లోడు’తో మరోసారి తన ట్రేడ్ మార్క్ కామెడీలోకి షిఫ్ట్ అయ్యాడు. ఈసారి కచ్చితంగా నవ్విస్తామంటున్నాడు.

పీ.వి. గిరి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఓ నాలుగు రోజుల పాటు జరగనున్నషెడ్యుల్ తో టోటల్ షూటింగ్ ప్యాకప్ చెప్పనున్నారు యూనిట్. అల్లరి నరేష్ సరసన పూజా జావేరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ లో రిలీజ్ కానుంది