ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ ..?

Tuesday,September 06,2016 - 03:30 by Z_CLU

 

ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ తో థియేటర్స్ లో సందడి చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్…. తదుపరి సినిమా పై సస్పెన్స్ కొనసాగుతుంది. ఓ సినిమా విడుదలకి ముందే నెక్ట్స్ సినిమా వివరాలు ప్రకటించే తారక్ గ్యారేజ్ విడుదలకి ముందే వక్కంతం వంశీ తో సినిమా ఉంటుందని ప్రకటించాడు. కానీ ఈ సినిమా పై ప్రస్తుతం అందరిలోనూ అనుమానాలు ఉన్నాయి. దీనికి కారణం తాజాగా వక్కంతం వంశీ.. మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టాడనే టాక్ వినిపించడమే. అల్లు అర్జున్ ను కలిసి వక్కంతం ఓ కథ వినిపించాడని టాక్ బలంగా వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ… వక్కంతం మాత్రం తారక్ ప్రాజెక్టు నుంచి సైడైపోయాడంటూ పుకార్లు మాత్రం వ్యాపించాయి. ఇదే యాంగిల్ లో చాలా ప్రశ్నలు బయల్దేరాయి. ఇన్నాళ్లూ తారక్ కు దగ్గరగా ఉన్న వక్కంతం ఒక్కసారిగా బన్నీని ఎందుకు కలిశాడు.. వక్కంతం సినిమా నుంచి తారక్ తప్పుకున్నాడా… లేక ఆల్రెడీ కమిట్ అయిన తారక్ సినిమా నుంచి వక్కంతమే బయటకు వచ్చేశాడా.. లేదా తారక్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత వక్కంతం-బన్నీ సినిమా షురూ అవుతుందా…?ఇలా ఎన్నో సందేహాలు సినీ అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వనని తారక్ ఇప్పటికే చెప్పేశాడు. జనతా గ్యారేజ్ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన తారక్… కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న తర్వాతే నెక్ట్స్ ప్రాజెక్టు ఎనౌన్స్ చేస్తానంటున్నాడు. సో… తారక్ చెప్పేంత వరకు ఈ సస్పెన్స్ కొనసాగాల్సిందే.