నాగ చైతన్య పెళ్లి పై నాగ్ రియాక్షన్..

Tuesday,September 06,2016 - 01:55 by Z_CLU

అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చైతు, అఖిల్ పెళ్లిళ్ల పై నాగార్జున క్లారిటీ గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక వీరిలో అఖిల్ కంటే చైతు పెళ్లి గురించే ఎక్కువ టాపిక్ నడుస్తుంది. మరి చైతు పెళ్లి చేసుకోబోయేది ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతానే అని చాలా మంది చెప్పుకుంటున్నారు. మొన్నా మధ్య కుమారుల ఇద్దరి ప్రేమ వివాహాలకు అంగీకరించి నట్లు నాగ్ స్పష్టం చేసేసారు. కానీ వీరి పెళ్లిళ్ల డేట్ విషయం కానీ కోడళ్ల పేర్లు కానీ ప్రకటించలేదు నాగ్. అయితే ఇటీవలే ఓ పెళ్లి వేడుకలో అక్కినేని కుటుంబం తో పాటు సమంతా కూడా వీరితో కలిసి వెళ్లడం అక్కినేని కుటుంబం తో ఎక్కువ సేపు గడపడం తో అందరి చూపు సమంత పై పడింది. కానీ తనయుల పెళ్లిళ్ల పై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మన్మధుడు. ఇటీవలే ఓ సినిమా ప్రెస్ మీట్ కు హాజరైన నాగ్ ను పెళ్లిళ్ల డేట్ పై ప్రశ్నించగా… మంచి ముహూర్తం చూసి ప్రకటిస్తానని చెప్పాడు. మరి కింగ్ ఎప్పుడు కోడళ్లను మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేస్తాడో? డేట్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో? చూడాలి.