దిల్ రాజు మల్టీస్టారర్ పై అనుమానాలు?

Thursday,July 19,2018 - 11:12 by Z_CLU

ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ‘ఎఫ్-2’ అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు దిల్ రాజు. త్వరలోనే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో మల్టీస్టారర్ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మల్టీస్టారర్.. వీటన్నింటికంటే ముందు సినిమా. అదే ‘దాగుడుమూతలు’.

హరీష్ శంకర్, దిల్ రాజు కాంబోలో చాన్నాళ్ల కిందటే ఓకే అయింది ‘దాగుడు మూతలు’ సినిమా. కానీ ఇప్పటివరకు సెట్స్ పైకి రాలేదు. లేటెస్ట్ ఈ మల్టీ స్టారర్ పై రియాక్ట్ అయిన దిల్ రాజు… ఎందుకో ఆ స్క్రిప్ట్ వర్కవుట్ కావడం లేదని ప్రకటించాడు. స్టిల్ ఇప్పటికీ హరీష్ శంకర్ అదే ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నాడని ప్రకటించిన దిల్ రాజు.. ‘దాగుడు మూతలు’ ప్రాజెక్టుపై మరో వారం లేదా పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని ఎనౌన్స్ చేశాడు.

మరోవైపు ఇదే విషయాన్ని పరోక్షంగా హరీశ్ శంకర్ కూడా కన్ ఫర్మ్ చేశాడు. ఈ ఏడాది దిల్ రాజు బ్యానర్ లో వర్క్ చేసే ఛాన్స్ మిస్ అయిందంటూ ట్వీట్ చేశాడు. సో.. వీళ్లిద్దరి స్టేట్ మెంట్స్ బట్టి చూస్తుంటే.. ఈ ఏడాది ‘దాగుడు మూతలు’ సినిమా లేదనే విషయం స్పష్టమవుతుంది.