అదీ సంగతి – నితిన్ శ్రీనివాస కళ్యాణం

Thursday,July 19,2018 - 11:36 by Z_CLU

నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ కాన్సెప్ట్ టీజర్ రిలీజయింది. 51 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో సినిమాకి సంబంధించిన విజువల్స్ కాకుండా, జస్ట్ కాన్సెప్ట్ ని ఎలివేట్ చేయడానికే అన్నట్టు ఇమేజెస్ తో ప్రెజెంట్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ఈ సినిమా థీమ్ ని, సీనియర్ నటి జయసుధ వాయిస్ ఓవర్ తో రివీల్ చేశారు.

‘మనం పుట్టినప్పుడు మనవాళ్ళు పడే ఆనందం మనం చూడలేము, అలాగే పోయినప్పుడు మన వాళ్ళు పడే బాధను చూడలేము. మనం సంతోషంగా ఉండి, ఆ సంతోషాన్ని మన వాళ్ళు సెలెబ్రేట్ చేసుకునే సందర్భం  ఒక పెళ్ళిలో మాత్రమే జరుగుతుంది… అలాంటి పెళ్ళి గొప్పతనం గురించి చెప్పే ప్రయత్నమే ఈ సినిమా.

ఈ సినిమాలో పెళ్ళిలో జరిగే మ్యాజికల్ మూమెంట్స్ ని మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా టీమ్. అయితే ఈ రోజు ఈ కాన్సెప్ట్ టీజర్ తో సినిమాపై భారీ క్యూరియాసిటీ ని క్రియేట్ చేసిన ఫిల్మ్ మేకర్స్ ఈ నెల 22 న ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ‘కళ్యాణం వైభోగం’ సాంగ్ తో ఇంప్రెస్ చేసిన మ్యూజిక్ కంపోజర్ మిక్కీ.జె. మేయర్ సాంగ్స్ పై మ్యూజిక్ లవర్స్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఆగష్టు 9 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది.