సైరా Vs ఎన్టీఆర్

Thursday,July 19,2018 - 10:02 by Z_CLU

‘మహానటి’ సక్సెస్ తర్వాత ప్రేక్షకుల్లో  బయోపిక్ లపై మరింత ఆసక్తి పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి క్యురియసిటిని రైజ్ చేస్తున్నాయి రెండు బడా సినిమాలు.. మెగాస్టార్ చిరంజీవితో పాటు నందమూరి బాలయ్య కూడా త్వరలోనే బయోపిక్స్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ కాగా మరొకటి నటసింహం బాలయ్య నటిస్తున్న ‘ఎన్టీఆర్’.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ బడా హీరోల బడా బయోపిక్ లు చూసేందుకు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఈ సినిమాలకు ఇప్పటి నుండే మంచి బిజినెస్ జరుగుతుంది. నిజానికి ఇలా ఇద్దరు బడా హీరోలు ఒకే సారి రెండు బయోపిక్స్ ను సెలెక్ట్ చేసుకొని సెట్స్ పైకి తీసుకురావడం టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.

చిరు, బాలయ్య ఈ సినిమాల కోసం ఎంచుకున్న వ్యక్తులు మామూలు వ్యక్తులు కారు.. ఒకరేమో తెలుగు వారందరికీ తెలిసిన నందమూరి తారకరామారావు కాగా, మరొకరు కొందరికి మాత్రమే తెలిసిన స్వాతంత్ర్య సమర వీరుడు ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’. ఈ ఇద్దరి కథలు వెండితెరపై అద్భుతంగా తీర్చిదిద్దడానికి రెండు సినిమాలకు చెందిన యూనిట్స్ రాత్రి పగలు కష్టపడుతున్నాయి. ఇక్కడ మరో స్పెషాలిటీ ఏంటంటే.. ఈ ఇద్దరు హీరోల కెరీర్స్ లో భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఇవే.

చిరు, బాలయ్యలకు ఇవి ప్రేస్టిజియస్ మూవీస్ కావడంతో ప్రతీ చిన్న క్యారెక్టర్ కు బెస్ట్ ఆర్టిస్టులనే తీసుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు ఎంత కలెక్ట్ చేస్తాయనే విషయాన్ని పక్కనపెడితే.. వాళ్ల కెరీర్స్ లో ఇవి స్పెషల్ మూవీస్ గా నిలిచిపోవడం గ్యారెంటీ.