హీరోయిన్ వేటలో పడ్డ రామ్ చరణ్

Thursday,September 29,2016 - 01:08 by Z_CLU

ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఎనీటైం మెగా ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు చరణ్. ప్రస్తుతం ధృవ సినిమా షూటింగ్ లో ఉన్న చెర్రీ… త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో మరో డిఫరెంట్ మూవీ ప్లాన్ చేశాడు. ఈ సినిమా స్టోరీలైన్ ఎలా ఉంటుందనేది ఓ హాట్ టాపిక్ అయితే… ఇందులో హీరోయిన్ ఎవరనేది మరో హాట్ ఎలిమెంట్ గా మారింది. ఎందుకంటే.. హీరోయిన్స్ ను రిపీట్ చేసే అలవాటున్న రామ్ చరణ్… సుక్కూ సినిమాతో ఎవరినైనా రిపీట్ చేస్తాడా.. లేక ఫ్రెష్ కాంబోకు తెరతీస్తాడా అనేది డిస్కషన్ పాయింట్ గా మారింది.

ram-charan-and-kajal-selfie

ఇప్పటి వరకు చెర్రీ కెరీర్ ను గమనిస్తే ఆయన సినిమాల్లో రిపీటెడ్ హీరోయిన్లే ఎక్కువ. మరీ ముఖ్యంగా కాజల్ తో ఎక్కువ సినిమాలు చేశాడు మెగాపవర్ స్టార్. మళ్లీ మరోసారి కాజల్ కే అవకాశం ఇస్తాడా అనేది బిగ్ క్వశ్చన్. ప్రస్తుతం చిరు సరసన నటిస్తున్న కాజల్… ఆ వెంటనే చిరు తనయుడు చెర్రీ సరసన కనిపిస్తే బాగుంటుందా అనే యాంగిల్ లో సుక్కూ ఆలోచిస్తున్నాడట. పైగా మగధీర, ఎవడు, గోవిందుడు అందరివాడేలే.. ఇలా వరుసగా చెర్రీ-కాజల్ కాంబోలో సినిమాలొచ్చాయి. మళ్లీ కాజల్ తోనే చరణ్ సినిమా అంటే ఆడియన్స్ కు బోర్ కొడుతుందేమో.

rakul-preet-singh-feels-charan-has-no-bones_b_0910151033

కాజల్ ను కాదని రకుల్ ను రిపీట్ చేద్దామంటే.. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మతో బ్రూస్ లీ చేశాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ధృవలో కూడా రకులే హీరోయిన్. సో.. మళ్లీ వెంటనే రిపీట్ చేసే ఛాన్స్ లేదు. కాబట్టి… సుక్కూ-చెర్రీ సినిమాలో రకుల్ కు ఛాన్స్ లేనట్టే.

charan-tamanna-shruthi

ఇక రేసులో తమన్న, శృతిహాసన్ మాత్రమే మిగిలారు. వీళ్లతో కూడా చెర్రీ సినిమాలు చేశాడు. రచ్చలో మిల్కీబ్యూటీతో, ఎవడులో శృతిహాసన్ తో కలిసి నటించాడు. వీళ్లలో ఎవర్ని తీసుకున్నా… మళ్లీ రిపీట్ కాంబినేషనే అవుతుంది.

సో… ఈసారి చెర్రీ ఎవరితో కలిసి సెట్స్ పైకి వెళ్తాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. కథకు తగ్గట్టు హీరోయిన్ ను ఎంచుకునే బాధ్యతను సుకుమార్ కు వదిలేస్తాడా..లేక ఓ కొత్తమ్మాయిని తెరపైకి తీసుకొస్తాడా అనేది చూడాలి.