అస్సలు తగ్గేది లేదు..

Thursday,September 29,2016 - 12:52 by Z_CLU

వరుస సినిమాలతో దూసుకుపోతున్న సునీల్ ఈసారి దసరాపై కన్నేశాడు. ఇటీవలే ‘కృష్ణాష్టమి’, ‘జక్కన్న’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ హీరో… ‘ఈడు గోల్డ్ ఎహే’ తో మరోసారి లక్ చెక్ చేసుకోబోతున్నాడు. ఎంత గట్టి పోటీ ఉన్నప్పటికీ విజయ దశమి సందర్బంగా కచ్చితంగా విజయం అందుకోవాలని డిసైడ్ అయిపోయాడు. ఇందుకోసమే మొన్నటి వరకూ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను చాలా స్పీడ్ గా ముగించేశాడు ఈ కామెడీ హీరో. ఓవైపు ప్రేమమ్, మరోవైపు అభినేత్రి సినిమాలు రేసులో ఉన్నప్పటికీ… తాజా సినిమాపై అపారమైన నమ్మకంతో పోటీకి సై అంటున్నాడు.

ctb9sljvuaarav4-1

వీరు పోట్ల దర్శకత్వం లో ‘ఎటివి’ సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకొని, అక్టోబర్ 7 న విజయ దశమి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాతో తన దైన మార్క్ కామెడీ తో అలరించడానికి రెడీ అయిపోయాడు. మరి ఇంత పోటీ మధ్య… ఈ సినిమాతో సునీల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుంటాడో? వేచి చూడాలి..