కాటమరాయుడికి ఐటెం హంగులు..?

Thursday,September 29,2016 - 03:10 by Z_CLU

ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న కాటమరాయుడుకి క్రియేట్ అయిన హైప్ అంతా ఇంతాకాదు. అది పవర్ స్టార్ స్టామినా. నలుగురు తమ్ముళ్ళకు అన్నయ్యగా నటిస్తున్న పవన్ కళ్యాణ్… కేవలం నటీనటులతోనే కాకుండా… ఇప్పుడు ఐటెంసాంగ్ తో కూడా హల్ చల్ చేస్తోంది. హీరోయిన్లే ఐటెంసాంగ్స్ చేసేస్తున్న ఈ రోజుల్లో… పవన్ సినిమాలో ఏ హీరోయిన్ ఐటెంభామగా మారబోతుందా అనే ప్రశ్న మొదలైంది.

pawan-kalyan-kajal-agarwal-sardaar-gabbar-singh-photos-7

ఈమధ్యే జనతా గ్యారేజ్ లో కాజల్ ఐటెంసాంగ్ చేసింది. కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. సో… పవన్ అడిగితే కాజల్ తప్పకుండా కాటమరాయుడులో ఐటెంసాంగ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇలాంటి మేటర్స్ కు పవన్ దూరంగా ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే.

pawan-tamannaah

అటు తమన్న కూడా లిస్ట్ లో ఉండనే ఉంది. గతంలో పవన్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేసిన తమన్నా… ఐటెంభామగా కూడా పాపులర్ అయింది. తాజాగా జాగ్వార్ సినిమాలో మరో ఐటెంసాంగ్ చేసింది. సో… పవన్ కోరుకుంటే కాటమరాయుడిలో స్పెషల్ ఎప్పీయరెన్స్ ఇవ్వడానికి మిల్కీబ్యూటీకి ఎలాంటి అభ్యంతరం ఉండదు.

pawan-and-raai-lakshmi-in-tauba-tauba-song

గతంలో పవన్ సినిమాల్లో లక్ష్మీరాయ్, హంసానందిని లాంటి భామలు ఐటెంసాంగ్స్ లో కనిపించారు. మరి కాటమరాయుడులో మరోసారి వాళ్లనే రిపీట్ చేస్తారా..లేక హీరోయిన్ తో ఐటెంసాంగ్ ప్లాన్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.