Anushka Bollywood Entry... క్లారిటీ ఇచ్చిన స్వీటి

Monday,October 05,2020 - 04:46 by Z_CLU

‘బాహుబలి’ ఫ్రాంచైజీతో భారీ గుర్తింపు అందుకున్న Anushka Shetty తన బాలీవుడ్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది. తాజాగా అభిమానులతో ఛాటింగ్ చేసిన అనుష్క వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అందులో భాగంగానే బాలీవుడ్ ఎంట్రీ పై అభిమాని అడిగిన ప్రశ్నను ఆన్సర్ చేసింది.

ఇప్పట్లో బాలీవుడ్ ప్లాన్స్ లేవని..  ప్రస్తుతం నటిగా విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాలని మాత్రం ఆలోచిస్తున్నానని చెప్పుకుంది. తను చేసే ప్రతీ సినిమా ఎలాగూ హిందీలో కూడా విడుదలవుతుంది కాబట్టి హిందీ ఆడియన్స్ కి కూడా దగ్గరవుతున్నానంటూ క్లారిటీ ఇచ్చింది.

ఇదే చిట్ చాట్ లో మంచి స్క్రిప్ట్ దొరికితే ప్రభాస్ తో మళ్ళీ నటిస్తానని తెలిపింది. త్వరలోనే తను నటించే బోయే తదుపరి సినిమాల డీటెయిల్స్ బయటకొస్తాయని హింట్ ఇచ్చింది అనుష్క. మరి ఆ ప్రాజెక్ట్ ఏమిటా అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు.