అల్లరోడి దారిలో భేతాళుడు

Monday,November 14,2016 - 12:33 by Z_CLU

ఉన్నపలంగా రద్దయిన 500, 1000 రూపాయల ఎఫెక్ట్ బాక్సాఫీస్ పై మాత్రం భారీగా పడింది. మొన్నటికిమొన్న “సాహసం శ్వాసగా సాగిపో” సినిమాతో పాటు రిలీజ్ కావాల్సిన అల్లరి నరేష్ సినిమా “ఇంట్లో దెయ్యం నాకేం బయ్యం” సైలెంట్ గా సైడ్ కి తప్పుకుంటే, ఇప్పుడు భేతాళుడు కూడా అల్లరోడి దారే పట్టాడు.

డిఫరెంట్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విజయ్ ఆంటోని నటించిన భేతాళుడు రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. బిచ్చగాడు తరవాత వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ టాలీవుడ్ లో చిన్న సైజు వైబ్రేషన్ ను క్రియేట్ చేస్తే, సినిమా పోస్ట్ పోన్ న్యూస్ అభిమానులను కాస్త నిరుత్సాహపరిచిందనే  చెప్పాలి.

సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండే భారీ అంచనాలను సెట్ చేసుకున్న భేతాళుడుకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, విజయ్ అంటోని అకౌంట్ లో ఇంకో సూపర్ హిట్ గ్యారంటీ అనిపిస్తుంది.