గురు సినిమాతో కాటమరాయుడు కనెక్షన్...?

Monday,November 14,2016 - 08:35 by Z_CLU

పవన్ కల్యాణ్, వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ పవన్ కల్యాణ్ కు, వెంకటేష్ నటిస్తున్న గురు సినిమాకు కనెక్షన్ ఉందని ఇప్పటివరకు ఎవరూ అనుకోలేదు. కాానీ పవర్ స్టార్ కు, వెంకీ నటిస్తున్న గురు సినిమాకు కనెక్షన్ ఉంది. అది కూడా చాాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది.

pawan-venkatesh-1

మాధవన్ నటించిన సాలా ఖదూస్ సినిమాకు రీమేక్ గా గురు సినిమా వస్తోంది. ఒరిజినల్ సినిమాను డైరక్ట్ చేసిన సుధా కొంగర అనే దర్శకురాలే… గురు సినిమాను కూడా డైరక్ట్ చేస్తున్నారు. పైగా ఒరిజినల్ వెర్షన్ లో నటించిన రితికా సింగ్ ఇందులో కూడా కీలకమైన పాాత్ర పోషిస్తోంది. అయితే ఆ సినిమాతో పోలిస్తే, గురులో చిన్న మార్పు చోటుచేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు వీరాభిమానిగా కనిపించనుందట. పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లోని కొన్ని సూపర్ హిట్ సీన్లను రితికా సింగ్ ఎంజాయ్ చేసే సన్నివేశాల కూడా గురు సినిమాలో ఉన్నాయట. అలా పవన్ కల్యాణ్ కు, గురు సినిమాతో బంధం కుదిరింది.