సూపర్ స్టార్ రంగంలోకి దిగాడు 

Monday,June 04,2018 - 12:44 by Z_CLU

ఇంకో మూడు రోజుల్లో ‘కాలా’ సినిమాతో థియేటర్స్ లో హంగామా చేయబోతున్నాడు సూపర్ స్టార్ రజిని కాంత్… రిలీజ్  దగ్గరపడుతుండడంతో స్వయంగా రంగంలోకి దిగారు రజిని. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు హైదరాబాద్ లో జరగనున్న ప్రెస్ మీట్ కి అల్లుదు ధనుష్, దర్శకుడు రంజిత్ తో కలిసి హాజరు కానున్నారు.

‘కబాలి’ రిలీజ్ సమయంలో కొన్ని అనివార్యకారణాల వల్ల హైదరాబాద్ కు రాలేకపోయిన సూపర్ స్టార్ ఇప్పుడు ‘కాలా’ కోసం హైదరాబాద్ రానున్నారు. ఈరోజు సాయంత్రం తెలుగు మీడియాతో  సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారాయన. మరి ఈ సినిమా గురించి సూపర్ స్టార్ ఏం చెప్తారో… చూడాలి.