చైతు, మాధవన్ కాంబినేషన్.... మళ్ళీ రిపీట్ ?

Monday,June 04,2018 - 10:20 by Z_CLU

ఆ మధ్య తెలుగు రానందువల్లే… తెలుగులో సినిమాలు చేయట్లేదని చెప్పుకొచ్చిన మాధవన్ ప్రస్తుతం నాగ చైతన్య ‘సవ్యసాచి’ సినిమాలో ఓ నెగిటీవ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. పాయింట్ ఇంట్రెస్టింగ్ అనిపించడంతో పెద్దగా ఆలోచించకుండానే ఈ సినిమా ఓకే చేసేసాడట మాధవన్.. అయితే ఈ సినిమా సమయంలో చైతు కి మాధవన్ కి మంచి ఫ్రెండ్ షిప్ కుదిరిందట. ఆ రిలేషన్ షిప్ తోనే శివ నిర్వాన డైరెక్షన్ లో చైతూ సమంత కలిసి నటించబోయే సినిమాలో ఓ క్యారెక్టర్ కి మళ్ళీ మాధవన్ ను అడిగాడట చైతూ.

చైతూ చెప్పడంతో స్క్రిప్ట్ విన్న మాధవన్ ఈ సినిమా కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలుస్తుంది. ప్రస్తుతం వార్తగానే ఉన్నా త్వరలోనే మాధవన్ నటించబోతున్న విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించనున్నారట మేకర్స్. సో చైతూ..మాధవన్ కాంబినేషన్ మళ్ళీ రీపీట్ కానుందన్నమాట.