అరవింద సమేత'.. నో బ్రేక్ అంటున్న ఎన్టీఆర్.

Monday,June 04,2018 - 02:45 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటింగ్ మూవీ గా తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ ఫాస్ట్ ఫేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మొన్నటి వరకూ రామోజీ ఫిలిం సిటీ లో  వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో షూట్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్, మిగతా నటీనటులపై కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేస్తున్నారు యూనిట్.

బ్రేక్ తీసుకోకుండా జెట్ స్పీడ్ లో  సినిమాను  కంప్లీట్ చేసి రాజమౌళి సినిమాకు షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నాడు ఎన్టీఆర్. అందుకే వీలైనంత త్వరగా టోటల్ షూటింగ్ ప్యాక్ అప్ చెప్పాలని చూస్తున్నాడు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ రాయలసీమ యాసతో  సరికొత్తగా ఎంటర్టైన్ చేయనున్నాడని సమాచారం.  పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.