తలైవా బర్త్ డే ఈ రోజు

Monday,December 12,2016 - 08:47 by Z_CLU

ఎక్కడో బెంగళూర్ లో శివాజీ రావ్ గైక్వాడ్ గా పుట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు ఈ రోజు. ఆయన తిరుగులేని నటుడే అయినా, ఆయన కరియర్ లో బ్రేక్ చేసిన రికార్డులు లెక్క లేనన్ని ఉన్నా, ఇప్పటికీ అతి సాధారణ వ్యక్తిలా కనిపించే రజినీకాంత్, ప్రతి ఒకరికి ఆదర్శం. అభిమానులకైతే ప్రత్యక్ష దైవం.

ఈ రోజు 66వ ఏట అడుగు పెడుతున్న తలైవా, జయలలిత మరణం కారణంగా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా వరద సృష్టించిన భీభత్సానికి అతలాకుతలమైన చెన్నైని దృష్టిలో పెట్టుకుని, పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్న రజినీకాంత్, ఈ సారి కూడా తన పుట్టిన రోజు వేడుకలను జరపవద్దని మూడు రోజుల క్రితమే ఫ్యాన్స్ కి రిక్వెస్ట్ చేశారు.

ఆయన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉందామని డిసైడ్ అయినా, అభిమానులు గతంలోలా అట్టహాసంగా వేడుకలను జరపకపోయినా, నాలుగు దశాబ్దాలుగా జయాపజయాలతో సంబంధం లేకుండా, చెక్కు చెదరని వ్యక్తిత్వంతో సూపర్ స్టార్ లా వెలుగొందుతున్న రజినీకాంత్ పుట్టిన రోజు, అభిమానులకు ఎప్పటికీ పెద్ద పండగే. ఆయన ఎప్పటికీ ఇలాగే ఆయురారోగ్యాలతో ఉంటూ, మరెన్నో బ్లాక్ బస్టర్స్ తో అలరించాలని కోరుకుంటుంది ZEE CINEMALU.