నో బర్త్ డే సెలెబ్రేషన్స్

Saturday,December 10,2016 - 12:30 by Z_CLU

తన పుట్టిన రోజును సెలెబ్రేట్ చేయవద్దని మరోసారి రిక్వెస్ట్ చేశాడు రజినీకాంత్. జయలలిత మరణం తమిళనాడు మొత్తాన్ని ఒక్కసారిగా శోకసంద్రంలో ముంచేసింది. అమ్మ ఆరోగ్యంగా తిరిగి వస్తుందని ఆశగా ఎదురుచూసిన ఆమె అభిమానులకు నిరాశే మిగిల్చింది.

ఈ పరిస్థితుల్లో బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ ఎక్కడ హడావిడి మొదలుపెట్టేస్తారోనని మూడు రోజులు ముందుగానే, ఫ్యాన్స్ కి చిన్నగా నచ్చచెప్పే ప్రయత్నం మెదలుపెట్టేశాడు రజినీకాంత్.

రజినీకాంత్ పుట్టిన రోజును పండగలా ఫీల్ అయ్యే అభిమానులు, ప్రతిసారి చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తారు. అలాంటిది గతేడాది భీభత్సమైన వరదల వల్ల అతలాకుతలమైన చెన్నై పరిస్థితిని మైండ్ లో పెట్టుకుని, లాస్ట్ ఇయర్ కూడా సెలెబ్రేషన్స్ ని అవాయిడ్ చేసిన సూపర్ స్టార్, ఈ సారి అమ్మ మరణాన్ని దృష్టిలోపెట్టుకుని నో సెలబ్రేషన్స్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు.