మహేష్ బాబు రోల్ ఏంటో తెలిసిపోయింది

Monday,December 12,2016 - 10:00 by Z_CLU

చిన్న చిన్న విషయాలపై తరవాత ఫోకస్ పెడదాం కానీ, ముందు సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్దాం అనుకుని ఉంటారు. మురుగదాస్ & టీం. ఒకసారి సెట్స్ పైకి వెళ్ళాక కనీసం టైటిల్ డిసైడ్ చేసుకోవడం కోసం కూడా గ్యాప్ లేకుండా షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయారు మొత్తం సినిమా యూనిట్.

ఈ సినిమా టైటిల్ విషయంలో ఎన్ని రూమర్స్ వస్తున్నా, పెద్దగా చలించని సినిమా యూనిట్, సినిమాని తెరకెక్కించడం పై పెట్టిన కాన్సంట్రేషన్  ఏ మాత్రం డిస్టబ్ కాకుండా, ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు.

రీసెంట్ గా మహేష్ బాబు సినిమాను, మురుగదాస్ తన లాస్ట్ బ్లాక్ బస్టర్ తుపాకి సినిమా సెట్స్ లోకి షిఫ్ట్ చేశాడట. ఆ సినిమాకి ఈ సినిమాకి కనెక్షన్ ఏంటబ్బా అని వివరాల్లోకి వెళ్తే, అసలు విషయం అయితే తెలీలేదు కానీ, ఈ సినిమాలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపిస్తాడు అన్న విషయం తెలిసిపోయింది.