సునీల్ హడావుడి మామూలుగా లేదు...

Friday,September 16,2016 - 04:00 by Z_CLU

 

సునీల్‌ హీరోగా దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎ.టివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘ఈడు గోల్డ్‌ ఎహే’. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విజయదశమి కానుకగా అక్టోబర్‌ 7న రానుంది. దానికంటే ముందు సినిమా ఆడియోను వెరైటీ పద్ధతిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు యూనిట్.

మణిశర్మ తనయుడు సాగర్‌ సంగీతం అందించిన ఆడియోను 4 పట్టణాల్లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ ఆల్బమ్‌లోని మొదటి పాటను సెప్టెంబర్‌ 21న హైదరాబాద్‌లో, రెండో పాటను 22న వైజాగ్‌లో, మూడో పాటను 23న రాజమండ్రిలో, నాలుగో పాటను సెప్టెంబర్‌ 24న విజయవాడలో రిలీజ్‌ చెయ్యబోతున్నారు. ఈ వెరైటీ ప్రమోషన్… సునీల్ కు ఏ రేంజ్ లో కలిసొస్తుందో చూడాలి.