రొమాన్స్ చేస్తే రకుల్ తోనే....

Saturday,September 17,2016 - 07:00 by Z_CLU

ప్రస్తుతం యంగ్ అండ్ డైనమిక్ హీరోలంతా ఇదే కోరుకుంటున్నారు. రకుల్ తోడుంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ పాతుకుపోవడంతో… హీరోలంతా రకుల్ వెంటపడుతున్నారు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు సరసన ఓ సినిమాలో చేస్తోంది. రామ్ చరణ్ చేస్తున్న ధృవ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా నాగచైతన్య-కల్యాణ్ కృష్ణ సినిమాలో కూడా రకుల్ నే హీరోయిన్ గా తీసుకున్నారు. వీళ్లతో పాటు ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా రకుల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ ముద్దుగుమ్మ తన ప్రాజెక్టులో ఉంటే హిట్ గ్యారెంటీ అని గట్టిగా నమ్ముతున్నాడు. అతడే అక్కినేని సిసింద్రీ.. అఖిల్.

rakul-final

 

   త్వరలోనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన రెండో ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు అఖిల్. ఈ సినిమా కథ ఇప్పటికే ఓకే అయింది. స్క్రీన్ ప్లేకు ఫినిషింగ్ టచ్ మాత్రం ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులోకి రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలని అఖిల్ భావిస్తున్నాడు. అయితే అఖిల్ సరసన ఓ కొత్తమ్మాయి అయితే బాగుంటుందని నాగార్జున ఫీలింగ్. అటు విక్రమ్ కుమార్ మాత్రం హీరోయిన్ గురించి ఇంకా ఆలోచించడం లేదు. విక్రమ్-అఖిల్ సినిమాలో హీరోయిన్ ఎవరనేది త్వరలోనే తేలిపోతుంది.